సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (20:12 IST)

పట్టు చీరలు.. వెండి చీరలను ఎందుకు ధరిస్తారంటే?

Sarees-Fashion
వివాహాది కార్యక్రమాల్లో వెండి, బంగారు వస్తువులు, పట్టు వస్త్రాలు ఎందుకు వాడతారనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. సాధారణంగా ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, పెళ్లిళ్లలో అందరూ పట్టు వస్త్రాలను ధరిస్తారు. పట్టు వస్త్రాలు ధరించడం ద్వారా ప్రతికూల పవనాలను నిరోధిస్తుంది. పట్టు వస్త్రాలను ధరించడం ద్వారా బలం పెరుగుతుంది. 
 
వివాహాది కార్యక్రమాల్లో అనేకమంది హాజరవుతారు. ఆ సమయంలో వెలువడే అశుభ్ర పవనాలను పట్టు వస్త్రాలు శుద్ధి చేస్తాయి. ఆ పవనాల నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాగే ఆలయాలకు వెళ్లేటప్పుడు కూడా ఇదే కారణంతోనే పట్టు వస్త్రాలను ధరించాలి. పట్టు దుస్తులను అన్ని వయస్కుల వారు ధరించడం మంచిది. 
 
అలాగే ప్రస్తుతం అరటి దూటతో పట్టు వస్త్రాలను తయారు చేస్తున్నారు. అలాగే పట్టు వస్త్రాలతో పాటు వెండితో నేచిన చీరలు కూడా వచ్చేశాయి. రాగితో చేసిన వస్త్రాలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ప్రస్తుతం వెండితో నేసిన చీరలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇందుకు కారణం లేకపోలేదు. వెండిని ధరించడం ద్వారా శరీరానికి చాలా మేలు చేకూరుతుంది. పిల్లలకు వాడే వస్తువులను అధికంగా వెండిలో వాడటం మంచిది. 
 
పెద్దలు పాలు తీసుకునే గ్లాసులు వెండిలో వాడటం మంచిది. వెండి చీరలు, వెండి పాత్రలు వాడటం ద్వారా ఆరోగ్యానికి హాని చేసే క్రిములు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే పెళ్లిళ్లలో వెండితో తయారు చేసిన దుస్తులను ధరించడం ద్వారా సర్వ శుభాలు జరుగుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. వెండి శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. వెండి గొలుసులు ధరించడం ద్వారా నరాలకు బలం చేకూరుతుంది.