శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 డిశెంబరు 2024 (18:26 IST)

Jani Master: శ్రీతేజను పరామర్శించిన జానీ మాస్టర్.. ఇంత వరకే మాట్లాడగలను (video)

Jani Master
Jani Master
కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజని జానీ మాస్టర్‌ పరామర్శించారు. శ్రీతేజ కోలుకుంటున్నాడని.. చికిత్సకు స్పందిస్తున్నాడని.. త్వరలోనే మామూలు మనిషి అవుతాడని తెలిపారు జానీ మాస్టర్. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ.. శ్రీతేజ ఫ్యామిలీకి తమ వంతు సహాయాన్ని అందిస్తామన్నారు.
 
కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్‌ తరఫున సహాయం చేస్తామని  వెల్లడించారు. అందరికి వచ్చి పరామర్శించాలని ఉంటుంది, కానీ కొన్ని పరిధిలు ఉంటాయి, దాని కారణంగా రాలేకపోతారు. ఇప్పుడు అందరు వస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీ అని చెప్పాడు. 
 
అల్లు అర్జున్ వ్యవహారంతో పాటు తమ కేసు కోర్ట్ పరిధిలో ఉంది కాబట్టి తాను ఈ విషయంపై ఏమీ మాట్లాడలేనని తెలిపారు. తన సైడ్‌ నుంచి లీగల్‌గా సమస్య ఉందని, తాను ఇంత వరకే మాట్లాడగలనని వెల్లడించారు.