ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2024 (13:25 IST)

Jani master : జానీ మాస్టర్‌కు షాక్.. జోసెఫ్ ప్రకాశ్ భారీ మెజారిటీతో విజయం (video)

Jani Master
జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ తనను లైంగిక వేధించారని ఓ లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. లైంగిక ఆరోపణల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ కూడా అయ్యారు. ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు. 
 
ఈ నేపథ్యంలో డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఈ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా విజయం సాధించారు. 5వ సారి డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాశ్ ఎన్నికయ్యారు. 
 
దీంతో జానీ మాస్టర్‌కు దీంతో బిగ్ షాక్ తగిలింది. డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో జానీ మాస్టర్‌కు ఇదొక గట్టి ఎదురుదెబ్బగా చెప్పాలి.
 
కాగా ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో ప్రకాశ్‌ భారీ మెజార్టీతో విజయం సాధించారు. అధ్యక్షుడిగా ప్రకాశ్‌ ఎన్నికవడం ఇది ఐదోసారి. కాగా, జానీని అధ్యక్షుడిగా తొలగించడంతో పాటు ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జానీపై పోక్సో కేసు విచారణలో ఉండటం, అసోసియేషన్‌లో జానీ ప్రవర్తన అగ్రెసివ్‌గా ఉండేదనే రిపోర్టు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.