ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2024 (16:36 IST)

Sobhita: భ్రమరాంబ సన్నిధానంలో నాగచైతన్య- శోభిత (video)

Chay_Shobitha
Chay_Shobitha
Sobhita and Naga Chaitanya in Srisailam: నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహం ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ ముచ్చటైన వేడుకకు సినీ ప్రముఖులు చిరంజీవి దంపతులు, వెంకటేశ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, రానా, అల్లు అరవింద్‌ సహా పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అక్కినేని ఇంట్లో పెళ్లి సందడి ఇంకా ముగియలేదు. 
 
నాగ చైతన్య పెళ్లి తరువాత కొన్ని రోజులకు మళ్లీ అఖిల్ పెళ్లి పనులు స్టార్ట్ కానున్నాయి. అఖిల్, జైనబ్ పెళ్లి సమ్మర్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకున్న కొత్త జంట నాగచైతన్య- శోభిత దూళిపాళ్ల శ్రీశైలం భ్రమరాంబ-మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ మేరకు నాగార్జునతో పాటు కొత్త దంపతులు పట్టు వస్త్రాలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు పసుపు చీరలో శోభిత, పంచెకట్టుతో చైతూ ఆకట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.