సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 3 డిశెంబరు 2024 (22:32 IST)

సమంతకు ఇష్టమైన పనిని చేస్తున్న నాగచైతన్య, ఏంటది?

Samantha-Chaitu
సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఏవో కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. ఐనప్పటికీ నిత్యం వీరిద్దరి గురించి నెట్లో చర్చ జరుగుతూనే వుంటుంది. సమంతతో చైతన్య విడిపోయినప్పటికీ ఆమెకి ఎంతో ఇష్టమైన పనిని చేస్తున్నాడట. సమంత అనాధల కోసం తన పారితోషికం నుంచి సింహ భాగాన్ని కేటాయిస్తుంటారు. అంతేకాదు, ఆమెకు మొక్కలు పెంచడం అంటే ఎంతో ఇష్టం.
 
ఇందులో భాగంగా ఆమె పెళ్లయిన కొత్తలో కొన్ని అరుదైన మొక్కలను నాగచైతన్యకు గిఫ్టుగా ఇచ్చిందట. ఆ మొక్కలను నాగ చైతన్య ఇప్పటికీ కంటికి రెప్పలా కాపాడుతున్నాడట. విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ సమంత ఇష్టాలను నాగచైతన్య గౌరవిస్తున్నాడంటూ నెట్లో ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ వార్తలో నిజం ఎంత వున్నదో తెలియాల్సి వుంది. కాగా త్వరలో నటి శోభితను నాగచైతన్య వివాహం చేసుకోబోతున్నాడు.