మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 నవంబరు 2024 (11:02 IST)

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

Samantha Ruth Prabhu
నాగ చైతన్యతో విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడడంతో జీవితంలో ఎదురైన కఠినమైన సంఘటనలను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నసమంత ఎందరికో ఆదర్శంగా నిలిచింది. మయోసైటిస్‌ తర్వాత సినిమాను బాగా తగ్గిస్తూ వచ్చిన సమంత ఇటీవల సిటాడెల్‌ వెబ్ సిరీస్‌ ద్వారా ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇందులో సమంత యాక్షన్‌ సన్నివేశాల్లో నటించి మెప్పించింది. ఇక సినిమాల్లో బిజీగా లేకపోయినా సోషల్‌ మీడియా వేదికగా మాత్రం సమంత నిత్యం యాక్టివ్‌గా వుంటోంది.
 
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన పద్యాన్ని షేర్‌ చేసుకుంది. ‘ఈ పద్యం నాకు ఎప్పుడూ మార్గదర్శకంగా ఉంది. ఈరోజు ఈ పద్యాన్ని నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను అంటూ ఈ పద్యాన్ని అభిమానులతో పంచుకున్నారు సమంత. 
 
ఇంతకీ ఈ పద్యం అర్థం ఏంటంటే. "మీరు రిస్క్‌తో ఏదైనా కొత్త పని చేసి ఓడిపోతే.. మళ్లీ ప్రయాణాన్ని కొత్తగా మొదలుపెట్టాలి. అంతేగానీ.. ఆ ఓటమి గురించే ఆలోచిస్తూ కూర్చోకూడదు. మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకొని మరింత ధైర్యంగా ముందుకు వెళ్లాలి. మీ దగ్గర ఏం లేకపోయినా సరే సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి. అప్పుడు మనల్ని నిందించేవారికి సరైన సమాధానం చెప్పొచ్చు" అనే అర్థంతో ఈ పద్యం ఉంది.