గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 30 నవంబరు 2024 (10:34 IST)

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

Srilila, Rana, siddhu
Srilila, Rana, siddhu
టాక్ అఫ్ ది టౌన్ గా మారిన మొదటి ఎపిసోడ్ తరువాత ప్రైమ్ వీడియో  ది రానా దగ్గుబాటి షో' రెండవ ఎపిసోడ్లో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల సందడి చేశారు. సరదా సంభాషణ, లాఫ్ అవుట్ లౌడ్ మూమెంట్స్, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జర్నీ షేర్ చేశారు. సాంప్రదాయ టాక్-షో ఫార్మాట్ ని బ్రేక్ చేసిన ఈ షో వీక్షకులని కట్టిపడేసింది.
 
సిద్ధూ, రానా.. శ్రీలీలని తన బాలీవుడ్ అరంగేట్రం గురించి ప్రస్థావించారు. అధికారిక ప్రకటన ఇంకా ఉండటంతో, శ్రీలీల చాలా విషయాలు వెల్లడించకుండా ఉండటానికి ప్రయత్నించింది. కానీ రానా ఒత్తిడితో చివరికి “అది నిజం. నేను బాలీవుడ్‌లో పనిచేయడం ఇదే తొలిసారి. ఇది కొత్త, విభిన్నమైనది   అని చెప్పారు.

శ్రీలీల ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప 2ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ నంబర్ కిస్సిక్‌లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అలరించారు. బాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అరంగేట్రం చూసేందుకు ఇప్పుడు అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.
 
రానా తాను హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తరచుగా హాజరు కావడం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.  నేను వెళ్ళే ప్రతి పెళ్ళికి నిన్ను, మీ అమ్మని చూస్తుంటాను, నా కజిన్స్ నిన్ను వాళ్ళ చెల్లి అని పిలవడం విన్నాను.  అనగా.. శ్రీలీల స్పందిస్తూ,  మేము మీ (రానా) స్వస్థలమైన కారంచేడుకి దగ్గరగా ఉన్న ఒంగోలు నుండి వచ్చాము. మేము సంక్రాంతికి తరచుగా వెళ్తుంటాం  అని చెప్పారు.
 
స్పిరిట్ మీడియా బ్యానర్‌పై రానా దగ్గుబాటి హోస్ట్‌గా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్, క్రియేటర్ గా రూపొందించిన అన్ స్క్రిప్ట్ తెలుగు ఒరిజినల్ ఎనిమిది ఎపిసోడ్‌ల సిరీస్‌లో దుల్కర్ సల్మాన్, నాగ చైతన్య అక్కినేని, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల, నాని, ఎస్.ఎస్. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి అద్భుతమైన అతిథులు ఉన్నారు. ప్రతి శనివారం కొత్త ఎపిసోడ్‌లు రానుంది. రానా దగ్గుబాటి షో రెండవ ఎపిసోడ్ శనివారం, నవంబర్ 30న ప్రత్యేకంగా భారతదేశంలోని ప్రైమ్ వీడియోలో, ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలలో ప్రసారం కానుంది.