గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2024 (10:41 IST)

37 రోజుల్లో నరకం అనుభవించాం.. ఎంతో కోల్పోయాను : జానీ మాస్టర్

Jani Master
లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన తెలుగు చిత్ర నృత్యదర్శకుడు జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన శనివారం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఒక ఎమోషనల్ వీడియోతో పాటు తన మనసులోని మాట ఓ పోస్ట్ ద్వారా వెల్లడించారు. "గత 37 రోజుల్లో తాను ఎంతో కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల ప్రార్థనల వల్ల ఈ రోజు ఇక్కడ ఉన్నానని పేర్కొన్నారు. నిజం అనేది ఏదో ఒక రోజు బయటపడుతుందన్నారు. తన ఫ్యామిలీ పడిన కష్టం తనను ఎప్పటికీ వేదనకు గురి చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. తాను జైలులో ఉన్న సమయంలో తమ కుటుంబం నరకం అనుభవించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కాగా, జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్‌గా పని చేస్తూ వచ్చిన శృష్టివర్మ పెట్టిన లైంగిక వేధింపుల కేసులో హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విచారణ జరిపి అరెస్టు చేశారు. ఈ కేసులో జానీ మాస్టర్ 37 రోజుల పాటు జైల్లోనే గడిపారు.