మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2024 (16:40 IST)

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి!!

madan reddy
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత రాష్ట్ర సమితికి చెందిన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కలిశారు. శుక్రవారం సీఎం నివాసంలో ఆయనతో పాటు ఎలక్షన్ రెడ్డిలు కలిశారు. వీరు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారు. ఇటీవల పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అమితాసక్తిని చూపుతున్న విషయం తెల్సిందే. ఇలాంటి సమయంలో పలువురు భారాస ముఖ్య నేతలు ముఖ్యమంత్రిని కలవడం ఆ తర్వాత బీఆర్ఎస్‌కు టాటా చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం జరుగుతుంది. 
 
అలాగే, సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కలుసుకున్నారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి జీవన్ రెడ్డి సీఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీప్‌దాస్ మున్షీని కలిశారు. ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జులు కూడా మర్యాదపూర్వకంగా కలిసినవారిలో ఉన్నారు. 
 
పాలకొండ, అవనిగడ్డ అభ్యర్థులపై పవన్ కసరత్తు
 
జనసేన పోటీ చేయనున్న 21 అసెంబ్లీ స్థానాల్లో 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పాలకొండ, అవనిగడ్డ అభ్యర్థులపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కసరత్తు సాగుతోంది. పిఠాపురం పర్యటనకు ముందే వాటి అభ్యర్థులను ప్రకటించాలని భావించారు. కానీ ఆ రెండు స్థానాలకు పోటీపడుతున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రకటన కొంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. పాలకొండకు ఆరుగురు పోటీ పడుతున్నారు. పార్టీలో కొంత మంది నాయకులు ఆ సీటు ఇప్పిస్తామని కొంత మందిని వెంట పెట్టు కుని పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఎవరికి వారు పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 
 
ఇక్కడ వైసీపీ నుంచి విశ్వాసరాయి కళావతి పోటీ చేస్తున్నారు. జనసేన తరపున మహిళనే బరిలోకి దించే ఆలోచనలో జనసేన నాయకత్వం ఉంది. అవనిగడ్డ సీటు కోసం విక్కుర్తి శ్రీనివాస్, బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ పోటీ పడుతున్నారు. వీరిలో ఐవీఆర్ఎస్ సర్వేలో విక్కుర్తికే మొగ్గు ఉన్నట్లు తేలింది. ఈ రెండు సీట్లకూ అభ్య ర్థులపై పవన్ వీరాపురం పర్యటన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మచిలీపట్నం లోక్‌సభ సీటు విషయంలో కూడా కొంత గందరగోళం నెలకొంది. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇక్కడి నుంచి పోటీ చేసే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. ఆయన పోటీ నుంచి వైదొలిగితే గ్రీన్‌కో డైరెక్టర్ బండారు నరసింహారావు బరిలో నిలిచే అవకాశముంది.