మంగళవారం, 8 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 మార్చి 2025 (18:36 IST)

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

Bhadrachalam
Bhadrachalam
భద్రాచలంలో ఒక విషాదకరమైన ప్రమాదం జరిగింది. సూపర్ బజార్ సెంటర్‌లోని పంచాయతీ కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్థుల భవనం కూలిపోయింది. ఈ సంఘటనలో అనేక తీవ్రగాయాల పాలైనారని, నలుగురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారని సమాచారం. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. 
 
ఇప్పటికే ఉన్న పాత నిర్మాణంపై నాలుగు అదనపు అంతస్థులు నిర్మిస్తున్న సమయంలో కూలిపోయినట్లు తెలుస్తోంది. ట్రస్ట్ కింద సేకరించిన నిధుల ద్వారా భవనం నిర్మిస్తున్నట్లు సమాచారం. నిర్మాణ లోపాలు కూలిపోవడానికి దారితీశాయని అధికారులు భావిస్తున్నారు.
 
ప్రస్తుతం సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.