గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2024 (11:23 IST)

శీతాకాల విడిది కోసం భాగ్యనగరికి వస్తున్న రాష్ట్రపతి

Droupadi Murmu
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. శీతాకాల విడిది కోసం ఆమె భాగ్యనగరానికి ఈ నెల 17వ తేదీన వస్తున్నారు. ఆమె ఐదు రోజుల పాటు భాగ్యనగరిలోనే ఉంటూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ క్రమంలో 21న కోరిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఆమె సందర్శించనున్నారు. ఆమె ఈ మహిళా కాలేజీ శతాబ్ది వేడుకలను ప్రారంభిస్తారు.శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ఐదు రోజుల పాటు ఉండనున్నారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన పర్యటన షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది.
 
రాష్ట్రపతి ముర్ము 17వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశకు చేరుకుంటారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌లో జరిగే తొలి స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నగరానికి వస్తారు. ఈ నెల 20న సికింద్రాబాద్ నగరంలోని కాలేజ్ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్‌ను సందర్శిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో 'ఎట్ హోం' కార్యక్రమం నిర్వహిస్తారు. 
 
గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో 21వ తేదీన ఉదయం 11 గంటలకు వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి చేరుకుని శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళతారు.