suvichar
✕

నోరు ఉండి కూడా చెప్పరు... కిషన్ రెడ్డిపై రాజా సింగ్ విమర్శలు

Written By ఠాగూర్
Updated: సోమవారం, 9 జూన్ 2025 (10:33 IST)
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోమారు విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేయొచ్చంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అన్నారు. దీనిపై రాజా సింగ్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి సహాయం అడుగుతున్న వారికి చెవులు ఉన్నా వినపడవని వ్యాఖ్యానించారు. నోరు ఉండి కూడా చెప్పరంటూ రాజాసింగ్ అన్నారు. అలాంటి మహానుభావులను అడిగితే ఏం సహాయం చేస్తారని రాజాసింగ్ ప్రశ్నించారు.
 
నిజానికి రాజాసింగ్, కిషన్ రెడ్డిల మధ్య గత కొంతకాలంగా కోల్డ్‌వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నాయకుడినే లక్ష్యంగా చేసుకుని గోషామహల్ స్థానం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజా సింగ్ విమర్శలు గుప్పించారు.
 
ఇటీవల హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందిస్తూ కిషన్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు
 
రాజాసింగ్ వేదికపై నుంచే కిషన్ రెడ్డిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వారిద్దరి మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. వీరి మధ్య విభేదాలకు సంబంధించి పలు సందర్భాల్లో కిషన్ రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అలాంటివి పార్టీలో లేవని కొట్టిపారేశారు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వాటిని తామే పరిష్కరించుకుంటామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
 
కానీ చాలా కాలంగా కిషన్ రెడ్డి విషయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఇదే రకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలోనూ అభ్యర్థిని బీజేపీలో అందరూ సమర్థిస్తే రాజాసింగ్ మాత్రం బాహాటంగానే విమర్శించారు. ఆ నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యం చేసుకుని ఎమ్మెల్యే రాజాసింగ్‌తో మాట్లాడి సముదాయించిన విషయం తెలిసిందే.

అన్నీ చూడండి

Keerthy Suresh, Krithi Shetty : దళపతి సీన్ రీక్రియేషన్‌తో ప్రమోషన్స్ ప్రారంభించిన జనవరి 12 విడుదల

Prabhas Update: సన్నబడిన ప్రభాస్ లుక్‌పై అభిమానుల చర్చ - అమ్మవారిని దర్శించుకున్న ప్రభాస్

RAPO23 Update: తోడేలు భావాలున్న వ్యక్తి కథ గా రామ్ పోతినేని రాపో23 చిత్రం

repeat movie review :ఈ నగరానికి ఏమైంది, రిపీట్ చిత్రం ఎందుకు తీశారంటే.. రిపీట్ రివ్యూ

రాజా సింగ్‌ను కలిసిన దేవి విజ్ఞానం హిందీ చిత్ర బృందం, డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల

తర్వాతి కథనం
Show comments