సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2024 (13:19 IST)

తెలంగాణాలో మంగళవారం వెల్లడికానున్న టెన్త్ ఫలితాలు!!

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. ఆ దిశగా ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు ఆన్‌లైన్‌లో విడుదల చేసేలా ఏర్పాట్లుచేశారు. పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కూడా అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. అయితే, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈ ఫలితాలను మంత్రి విడుదల చేయడం లేదు 
 
ఇకపోతే, మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. సుమారుగా 5.08 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2,50,433 మంది బాలికలు, 2,57,952 మంది బాలురు ఉన్నారు. ఏప్రిల్ 13వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకన చేపట్టగా, ఈ ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org లో చెక్ చేసుకోవచ్చు.