సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2024 (16:34 IST)

Telangana Thalli Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఎలా వుందంటే?

Telangana Talli
Telangana Talli
తెలంగాణ తల్లి విగ్రహ రూపం మారింది. రేవంత్ సర్కార్ కొత్త తెలంగాణ విగ్రహ రూపానికి సంబంధించిన నమూనాను విడుదల చేసింది. ఈ నెల 9న సోనియా గాంధీ సచివాలయం ఎదుట విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.  
 
అంతేకాదు ప్రతిపక్ష పార్టీలో ఉన్న కీలకనేతలతోపాటు బీజేపీ నాయకుల సైతం ఆహ్వానాలు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆకుపచ్చ రంగు చీరలో తెలంగాణ తల్లి విగ్రహం రూపం విడుదలైంది. 
 
చేతిలో మొక్కజొన్న, వరికంకులు, మెడలో మూడు ఆభరణాలు, కాళ్లకు మెట్టెలు, పట్టీలు పెట్టిన కొత్త విగ్రహం ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్ పేట వద్ద సచివాలయ అధికారులు విగ్రహాన్ని తయారు చేయించారు.