సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2024 (14:49 IST)

రేవంత్ రెడ్డి కలిసి రూ.15 లక్షల చెక్కును అందజేసిన తెలంగాణ ఛాంబర్

Chamber kamity with CM
Chamber kamity with CM
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ సభ్యులు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిశారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ తరపున వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన రూ.15 లక్షల చెక్కును సీఎం గారికి అందజేశారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్, వైస్ ప్రెసిడెంట్ వి ఎల్ శ్రీధర్, జనరల్ సెక్రెటరీ అనుపమ్, ట్రెజరర్ శేఖర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి చెక్ ను అందజేశారు.
 
ఇప్పటికే పలువురు సినీరంగానికి చెందిన కథానాయకులు, నిర్మాతలు సి.ఎం. సహాయనిధికి తమవంతు సాయంగా అందజేశారు. త్వరలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సిని రంగ సమస్యలపై చర్చించనున్నారు.