1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Keerthy Suresh's Maldives Diaries with hubby Antony Thattil is pure couple goals

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

keerthy suresh
ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మాల్దీవుల్లో రొమాంటిక్ వెకేషన్‌లో ఉన్నారు. తనభర్తతో కలిసి ఆమె పర్యాటక ప్రాంతంలోని అందమైన లొకేషన్లలో విహరిస్తూ తన మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తమ వెకేషన్‌కు సంబంధించి అందమైన ఫోటోలు, వీడియోలను ఆమె తన ఇన్‌స్టాఖాతాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
తొలుత శ్వేతవర్ణం దుస్తులు, తనకు పెద్ద టోపీ ధరించిన తీసుకున్న సెల్ఫీ ఫోటోను ఆమె షేర్ చేశారు. ఆ తర్వాత వారు బస చేసిన రిసార్టులో షికారు చేస్తున్న చిన్నపాటి వీడియోను కూడా పంచుకున్నారు. అందమైన ప్రకృతి నేపథ్యంలో భర్త ఆంటోనీతో దిగిన ఓ ముచ్చటైన ఫోటోను కూడా ఆమె పోస్ట్ చేశారు. ఈ వెకేషన్‌లో కీర్తి సురేష్ చాలా రిలాక్స్‌డ్‌, స్టైలిష్ లుక్స్‌లో కనిపించారు. కాగా, ఆమె షేర్ చేసిన ఫోటోలకింద మానసికంగా మాల్దీవుల్లో, శారీరకంగా ఇక్కడే అనే క్యాప్షన్‌ను ఈ పోస్టుకుజోడించారు. 
తర్వాతి కథనం
Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది