శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2024 (11:18 IST)

ఉద్యమకారుడు ఈటలను గెలిపించేందుకు రాజీనామా చేస్తున్నా : బీఆర్ఎస్ నేత బేతి సుభాష్ రెడ్డి

bethi subhash reddy
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలోని విపక్ష భారత రాష్ట్ర సమితి పార్టీకి షాకులపై షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన అనేక సీనియర్ నేతలు, ప్రజా ప్రతినిధులు, మాజీలు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు పోటీపడుతున్నారు. ఇప్పటికే అనేక మంది నేతలు రాజీనామాలు చేయగా, తాజా మరో నేత టాటా చెప్పేశారు ఎంపీ టక్కెట్ కేటాయింపులపై అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. 
 
తాజాగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కూడా కారు దిగిపోయారు. మల్కాజ్‌గిరి  లోక్‌‍సభ టిక్కెట్ కేటాయింపులో ఎవరినీ సంప్రదించకుండానే ఏకపక్షంగా లక్ష్మీరెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ టిక్కెట్ కేటాయించడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. లక్ష్మారెడ్డి ఓ పక్కా అవకాశవాది అని, ఆయనను గెలిపించాలంటూ ప్రజల వద్దకు వెళ్లలేనని పేర్కొంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు సుభాష్ రెడ్డి లేఖ రాశారు. 
 
మరోవైపు, బీజేపీ మాత్రం ఉద్యమకారుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు టిక్కెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. అందుకే అవకాశవాది కోసం కాకుండా ఉద్యమకారుడు ఈటల రాజేందర్‌ను గెలిపించేందుకు పని చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ చీఫ్‌కు పంపిన లేఖలో బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.