శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2024 (16:20 IST)

వరంగల్‌లో పెరుగుతున్న వైరల్ ఫీవర్లు, డెంగ్యూ కేసులు

fever
గత కొన్ని వారాలుగా గ్రేటర్ వరంగల్ పరిధిలో వైరల్ ఫీవర్లు, డెంగ్యూ విజృంభిస్తోంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి, బాడీ పెయిన్‌, తీవ్ర జ్వరం వంటి వైరల్‌ ఫీవర్‌ లక్షణాలతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరిగింది.

వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో రోజూ ఔట్ పేషెంట్ (ఓపీ) సంఖ్య 500 నుంచి 800 వరకు ఉండగా, అందులో 30 నుంచి 40 శాతం మంది వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. గ్రేటర్ వరంగల్‌లో 128 డెంగ్యూ కేసులు, ఒక మలేరియా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

నగరంలో డెంగ్యూ కేసులు 300 దాటిపోయాయని అంచనా వేస్తున్నట్లు పలు వర్గాలు చెబుతున్నాయి. నగరంలోని దేశాయిపేట ప్రాంతంలో మలేరియా కేసు నమోదైంది. ఎంజీఎం ఆస్పత్రిలో ప్రతిరోజు 250 మందికి పైగా చిన్నారులు సీజనల్ జ్వరాలతో వస్తున్నారని, వారిలో 50 మందికి పైగా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

నగరంలో ఈ నెలలోనే 60 మందికి పైగా చిన్నారులు డెంగ్యూ బారిన పడ్డారని అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో పిల్లల కోసం 150 పడకలు ఉన్నాయి. కానీ అవి తక్కువగా వున్నాయి. వృద్ధులు, పిల్లలు, మహిళలు ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారు.

కాశీబుగ్గ, దేశాయిపేట, కొత్తవాడ, రంగంపేట, కీర్తినగర్, లేబర్ కాలనీ, మామిడిబజారు, శివనగర్, రంగశాయిపేట, ఖిలావరంగల్ కోట, గొర్రెకుంట, ధర్మారం, ఏనుమాముల, సుందరయ్యనగర్, పైడిపల్లి, మామునూరు ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు