1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Pawan Kalyan Suffering From Viral Fever

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్

pawan
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. దీంతో బుధవారం జరగాల్సిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆ పార్టీ రద్దు చేసింది. ఈ సమావేశం తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఆ పార్టీ తెలిపింది. 
 
ఇటీవల జరిగిన వారాహి నాలుగో యాత్రలోనే పవన్ అస్వస్థతకు లోనయ్యారు. అప్పటి నుంచి ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం జరగాల్సిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం రద్దు అయింది. 
 
వచ్చే ఎన్నికల్లో పొత్తు నేపథ్యంలో టీడీపీతో కలిసి క్షేత్ర స్థాయిలో వెళ్లే అంశంపై పార్టీ నేతలకు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయాల్సివుంది. కానీ, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నందు ఈ సమావేశం వాయిదాపడింది. సమావేశం జరిగే తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని జనసేన పార్టీ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
About Writer
వరుణ్