మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2023 (17:21 IST)

ఇది రూపాయి పావలా ప్రభుత్వం.. పవన్ కల్యాణ్ సెటైర్లు

pawan kalyan
నిధులు మళ్లింపు, నిధులు దోచేయటంలో ఏపీలోని జగన్ ప్రభుత్వం ఆరితేరిందని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెటైర్లు విసిరారు. ఇది రూపాయి పావలా ప్రభుత్వం అని వ్యంగ్యంగా విమర్శించారు. జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. 
 
యువతకు ఉద్యోగాలు కల్పించకపోవడం వల్లే జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని పెడన సభలో పవన్ కళ్యాణ్ అన్నారు. జన సైనికులపై వైసీపీ దాడులు చేస్తుందని మండిపడ్డారు. 39 కేసుల్లో నిందితుడైన జగన్ రాజకీయాలకు అనర్హుడని మండిపడ్డారు. జగన్‌ను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానివ్వకూడదు అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
 
కేవలం ఓట్ల కోసమే వైసీపీ పథకాలను తీసుకొస్తుందని, అమలుకు వచ్చేసరికి అంతా డొల్లతనం మాత్రమే కనిపిస్తుందని పవన్ అన్నారు. వైసీపీని గద్దె దించడం కోసమే తెలుగుదేశం పార్టీతో జత కట్టామని 2024లో జనసేన, టిడిపి ప్రభుత్వం రాబోతుందని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు.