గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (22:47 IST)

ప్రియుడిపై మోజు.. భర్తను లవర్‌తో కలిసి హతమార్చిన భార్య.. ఎక్కడ?

crime
ప్రియుడిపై మోజుతో అతడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేయించింది భార్య. ఈ ఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  మహబూబ్‌నగర్ బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామానికి చెందిన వడ్డెర పర్వతాలు, ఆయన భార్య అనసూయ స్థానిక చౌరస్తాలో టీ హోటల్ నిర్వహిస్తున్నారు. 
 
ఈ క్రమంలో టీ హోటల్ దుకాణానికి దగ్గర ఉన్న టిఫిన్ సెంటర్‌లో పనిచేసే వ్యక్తి కమ్మరి బాలరాజుతో అనసూయకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఇక తరచూ మనస్పర్థలతో గొడవపడుతున్న భర్త పర్వతాలును అంతమొందించాలని డిసైడ్ అయ్యింది అనసూయ. 
 
ఈ క్రమంలో ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసి భర్తను హతమార్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 
 
అనుమానం పేరిట హతుడి భార్య వద్ద జరిపిన విచారణలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కథంతా బయటకు వచ్చింది. దీంతో అనసూయ, బాలరాజు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.