శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2024 (22:17 IST)

బెంగళూరులో దారుణం- మహిళ హత్య.. ఫ్రిజ్‌లో 30 ముక్కలుగా నరికిన..?

crime
బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. 29 ఏళ్ల మహిళను హత్య చేసి 30 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో నింపేశారు. బెంగళూరులో ఛిద్రమైన మహిళ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. మృతురాలు అద్దెకు వుంటున్న గది నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇంటి లోపలికి వెళ్లి చూడటంతో.. ఫ్రిజ్‌లో మృతదేహం ముక్కలు చూసి షాకయ్యారు. ఆపై ఫోరెన్సిక్ అధికారులు రంగంలోకి దిగారు. 
 
ఈ ఘటన వ్యాలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో జరిగిందని పోలీసులు శనివారం తెలిపారు. బాధిత మహిళను మహాలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. భర్త నుంచి వేరుగా వుంటూ.. టైలరింగ్ పని చేస్తోందని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఈ హత్య నాలుగైదు రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది.
 
కర్ణాటకలో బెంగళూరుకు దూరంగా ఓ ఆశ్రమంలో పనిచేస్తున్న బాధిత యువతి భర్త ఈ విషయం తెలుసుకుని తిరిగి వచ్చాడు. మృతదేహాన్ని గుర్తించామని, దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.