ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (18:40 IST)

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

arti ravi
జయం చిత్రంతో మంచి పాపులర్ అయిన ప్రముఖ సినీ నిర్మాత ఎడిటర్ మోహన్ రెండో కుమారుడు రవి. "జయం" చిత్రం తర్వాత ఆయన పేరు 'జయం' రవిగా మారిపోయింది. అయితే, ఇటీవల తన భార్య ఆర్తి రవికి విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వారి 15 యేళ్ల వైవాహిక జీవితం త్వరలోనే ముగియనుంది. అయితే, ఈ విడాకుల ప్రకటనను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ విడాకుల గురించి తనకు తెలియదని ఆమె ప్రకటించారు. దీంతో జయం రవితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. 
 
ఈ క్రమంలో జయం రవి విడాకుల ప్రకటన వెనక అసలు కారణాన్ని తమిళ ఇన్వెస్టిగేటివ్ మ్యాగజైన్ నక్కీరన్ వెల్లడించింది. బెంగళూరుకు చెందిన సింగర్‌తో జయం రవికి రిలేషన్ ఉందని, భార్యాభర్తల మధ్య విభేదాలకు అదే కారణమని పేర్కొంది. దీనికితోడు ఆ సింగర్‌తో కలిసి రవి వెకేషన్ కోసం గోవా వెళ్లడం వారి మధ్య విభేదాలను మరింత రాజేసిందని వివరించింది.
 
ఆ సింగర్ గోవాలో ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు జూన్‌లో జరిమానా కూడా చెల్లించిందని పేర్కొంది. అదేసమయంలో అదే కారు ఓవర్ స్పీడ్‌కు జయం రవి కూడా జరిమానా చెల్లించాడని తెలిపింది. ఆ కారును గతంలో సింగర్ ఉపయోగించిందని వివరించింది. దీనినిబట్టి వారిద్దరి మధ్య రిలేషన్ ఉందని అర్థమవుతోందని పేర్కొంది. రవితో సమస్యను పరిష్కరించుకోవాలని ఆర్తి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని నక్కీరన్ రాసుకొచ్చింది.