ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (12:17 IST)

నా సమ్మతం లేకుండానే విడాకులు ప్రకటన చేశారు.. ఆర్తి రవి

arti ravi
తనకు తెలియకుండా లేదా తన సమ్మతి లేకుండానే తమ వివాహ రద్దుపై హీరో జయం రవి ప్రకటన చేశారని ఆయన భార్య ఆర్తి రవి ప్రకటించారు. మా విడాకుల సంబంధించి జయం రవి ఇటీవల బహిరంగ ప్రకటన చేయడంతో తాను దిగ్భ్రాంతికి గురికావడంతో పాటు మానసికంగా కుంగిపోయినట్టు ఆమె బుధవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
తమ 18 సంవత్సరాల బంధం అనంతరం ముఖ్యమైన విషయాన్ని గౌరవం, గోప్యతతో నిర్వహించాలని తాను బలంగా నమ్ముతున్నాను. కొంత కాలంగా నా భర్తతో నేరుగా మాట్లాడటానికి అనేక అవకాశాలను కోరుకున్నాను. దురదృష్టవశాత్తూ, ఆ అవకాశం నాకు లభించలేదు. ఈ ప్రకటనతో నా పిల్లలు, నేను పూర్తిగా దుఃఖసాగరంలో మునిగిపోయాం. మా వివాహం నుండి వైదొలగాలనే నిర్ణయం పూర్తిగా ఒక వైపు మాత్రమే జరిగింది. మా కుటుంబానికి ప్రయోజనం కలిగించదు. ఇది బాధ కలిగించినప్పటికి తాను గౌరవప్రదంగా ఉండటాన్ని ఎంచుకున్నాను.
 
తనపై అన్యాయంగా నిందలు వేసి, తప్పుడు కథనాలు రావటం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ నిరాధార ఆరోపణలను అడ్రస్ చేయకుండా లేకుండా పోతున్నాను. ఒక తల్లిగా, నా మొదటి ప్రాధాన్యత మరియు ఎల్లప్పుడూ నా పిల్లల శ్రేయస్సే. నా దృష్టి మా పిల్లల శ్రేయస్సుపైనే ఉంది. కాలక్రమేణా, మా ఈ పరిస్థితి యొక్క కారణాలు అందరికీ అర్థమవుతాయని నేను నమ్ముతున్నాను అని ఆర్తి రవి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.