బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (19:50 IST)

తండ్రి అయిన హీరో నితిన్ - మా కుటుంబంలోని సరికొత్త స్టార్‌కి స్వాగతం!

Nithiin and Shalini
Nithiin and Shalini
నటుడు నితిన్ తండ్రి అయ్యాడు. అతని భార్య షాలిని ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. నవజాత శిశువు తన తల్లిదండ్రులతో చేతులు పట్టుకొని ఉన్న చిత్రాన్ని పంచుకోవడం ద్వారా కుటుంబ సభ్యులు ప్రకటించారు. 
 
ఫోటోను షేర్ చేస్తూ నితిన్, "మా కుటుంబంలోని సరికొత్త స్టార్‌కి స్వాగతం!" అని ట్వీట్ చేశాడు. బిడ్డ చేతిని నిమురుతూ నితిన్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా నితిన్‌కి తోటి సెలబ్రిటీల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 
 
నితిన్- షాలిని 2020లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నితిన్ చివరిగా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో కనిపించాడు. ప్రస్తుతం తమ్ముడు, రాబిన్ హుడ్ అనే రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. తమ్ముడు చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఇందులో సప్తమి గౌడ కథానాయికగా నటిస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ తెరకెక్కుతోంది. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.