గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2024 (14:06 IST)

నడలేని స్థితిలో నటుడు షిఫ్ వెంకట్ - సాయం కోసం ఎదురు చూపు

Fish venkat
Fish venkat
ఎన్.టి. ఆర్. సినిమా ఆది లో దర్శకుడు వినాయక్ ద్వారా నటుడిగా మారాడు ఫిష్ వెంకట్. తెలంగాణా యాసతో ఆకట్టుకున్న నటుడిగా పేరుతెచ్చుకున్న ఆయన్ను అప్పట్లో శ్రీహరి బాగా ఎంకరేజ్ చేసేవారు.   సికింద్రాబాద్ లోని రామ్ నగర్ దగ్గర షిఫ్ మార్కెట్ లో చేపలు అమ్మేవాడు. ఆయన భార్య సువర్ణ అక్కడ చేపలు వ్యాపారం చేస్తుండేది. వెంకట్ సినిమాల్లో బిజీగా మారడంతో ఆమెనే చేపల వ్యాపారాన్ని చూసుకుంటుంది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఇటీవలే ఓ ఫంక్షన్ లో ఆయన్ను చూస్తే అందరికీ ఆశర్యం వేసింది. ఒకప్పటి ఫిట్ నెస్ లేదు. బాగా బక్కచిక్కి వున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వూలో చెప్పిన విశేషాలు. 
 
నటుడిగా నాలుగేళ్ళుగా చేయలేకపోయాను. చాలా  ఆఫర్లు వచ్చాయి. బాడీ సహకరించలేదు. కిడ్నీ ఫెయిల్యూర్, షుగర్, బీపీ వున్నాయి. ఓసారి కుడికాలికి గాయం అవడంతో ఆ తర్వాత జరిగిన బాడీలో పరిణామాల వల్ల సరిగ్గా నిలబడలేని స్థితిలో వున్నారు. డయాలసిస్ కూడా చేశారు. డాక్టర్లు కుడికాలి తొడ దగ్గర చిన్న శస్త్రచికిత్స చేశారు. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వల్ల కొద్దిరోజులకు కుడికాలు చర్మం అంతా ఊడిపోతుంది. ఈ విషయమై ఆయన స్పందిస్తూ.. నాకు వచ్చిన అనారోగ్యంతో నిమ్స్ లో చికిత్స చేయించుకున్నాను.  కానీ నేనుండే రామ్ నగర్ నుంచి అంతదూరం వెల్లలేక గాంధీ ఆసుపత్రికి మార్చాను. 
 
నా బాడీ సహకరించకపోవడంతో చాలా ఆపర్లు వదులుకోవాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో ఎవరికీ నా అనారోగ్యం గురించి చెప్పలేదు. దాదాపు ఇప్పటి వరకు 18 లక్షలు ఖర్చయ్యాయి. నాకు ఇద్దరు కొడుకులు. ఒక కుమార్తె.. కుమారులు ఏదో పనిచేస్తుంటారు. వారి ఆదాయం అంతంత మాత్రమే.. నేను బాగా వున్న రోజుల్లో పలువురికి సాయం చేశాను. కానీ వారెవరూ ఇప్పుడు అందుబాటులో లేరు. 
 
నేను ఉత్తరాదిలో ఓ పెద్ద సినిమా షూటింగ్ లో వుండగా వెరైటీ షూస్ వేసుకోవాల్సి వచ్చింది. ఆ షూ వేసుకున్నాక కాలి చివర ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. తర్వాత షూను మార్చమని అడిగాను. ఎందుకనే కుదరలేదు. కానీ ఆ షూటింగ్ అయ్యాక రాంనగర్ లోని సౌమ్య ఆసుప్రతిలో జాయిన్ అయ్యాను. అప్పుడు షుగర్ వల్ల కాలు దెబ్బతిందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం అనారోగ్యంతో వున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష న్ లో మెంబర్ షిప్ తీసుకోవడానికి గతంలోనే డబ్బులు కట్టాను. కానీ ఓ వ్యక్తి నాకంటే జూనియర్ కు మెంబర్ షిప్ ఇచ్చాడు. ఆ తర్వాత దివంగత తారక రత్నగారు కూడా మెంబర్ షిప్ కోసం రికమండేషన్ లెటర్ కూడా రాశారు. కానీ అది కూడా పక్కన పెట్టడం జరిగింది. ఇక చేసేదిలేక ఆ కట్టిన డబ్బులు వేరే వారి పేరున ఇవ్వమని చెప్పాను. 
 
ప్రస్తుతం చాలా దయనీయంగా వున్న షిఫ్ వెంకట్.. సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన ఫోన్ నెం. 9849359534కు సంప్రదించవచ్చు.