శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2024 (12:28 IST)

వరదలో అన్నీ కోల్పోయినవారికి అండగా వుంటాం: సోనూసూద్

Sonusood
Sonusood
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలో వరద భీబత్సానికి తీవ్ర నష్టం జరిగిన ప్రజలకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర టీమ్ తగు చర్యలు తీసుకోవడం పట్ల జాతీయ నటుడు సోనూసూద్ హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొద్దిరోజులు ప్రజలు ఇల్లు కోల్పోయి తిండికి కూడా ఇబ్బంది పడుతున్న వారిని ప్రభుత్వాలు హెల్ప్ చేస్తున్నాయి. వరదలు రావడం విచారకరం. అందుకే త్వరలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. నా టీమ్ కూడా ప్రజలకు తగిన సేవ చేస్తున్నారు. 
 
వరదలతో ఆంధ్రా, తెలంగాణ పోరు సాగిస్తున్న వేళ, ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తాం. త్వరలో మీముందుకు వచ్చి మీకు కావాల్సిన సాయం చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇందుకు మీరు [email protected]లో మమ్మల్ని చేరుకోండి. మాకు తగినవిధంగా మెయిల్ చేస్తే మాటీమ్ కానీ, నేనే స్వయంగా వచ్చి మీకు తగు సాయం చేస్తానని వీడియో విడుదల చేశారు.