శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 మార్చి 2024 (17:20 IST)

కమల్ సినిమా థగ్ లైఫ్ నుంచి ఇద్దరు హీరోలు తప్పుకున్నారు?

Kamal Haasan
Kamal Haasan
హీరో కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న చిత్రం “థగ్ లైఫ్”. ఈ సినిమాకు కొన్ని కష్టాలు వచ్చిపడ్డాయని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమానుంచి ఇప్పటికే దుల్కర్ సల్మాన్, జయం రవిలు తప్పుకున్నట్లు తెలుస్తోంది. కమల్ ఏ సినిమా చేసినా దానికి సంబంధించిన కాంట్రవర్సీలు వస్తూనే వుంటాయి. ఇది అలాంటిదే అని కమల్ సన్నిహితులు తెలియజేస్తున్నారు.
 
తాజాగా కమల్ హాసన్.. ప్రభాస్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్  ఆయన పాత్రను డిజైన్ బాగా చేశాడని తెలిసింది. ఈ చిత్రంలో భాగంగా థగ్ లైఫ్ వాయిదా పడుతున్నట్లు, ఇద్దరు హీరో డేట్స్ క్లాష్ వల్ల తప్పుకున్నారని సమాచారం. కాగా, వారి స్థానంలో శింబును తీసుకోనున్నట్లు సమాచారం.  ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ మూలాన కమల్ సినిమా షూటింగ్ కి దూరంగా ఉండడంతో తాత్కాలికంగా సినిమా ఆగిపోయింది.