బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 మార్చి 2024 (13:35 IST)

దీపికా లేనప్పుడు డార్లింగ్‌ను ఫోటో తీసిన దిశా పటానీ

prabhas_disha patani
ప్రభాస్-నాగ్ అశ్విన్  కల్కి 2898 AD షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఈ సందర్భంగా దీపికా పదుకొణె, దిశా పటానీ షూటింగ్‌లో బిజీగా వున్నారు. అయితే దీపికా పదుకునే లేనప్పుడు దిశా పటానీ షూటింగ్ స్పాట్‌లో అందరినీ ఆకట్టుకుంటోంది. 
 
కల్కి 2898 AD బృందం కొన్ని సుందరమైన ప్రదేశాలలో ప్రభాస్, దిశా పటానిలపై పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షూటింగ్‌కు ఇటలీ వేదికగా మారింది. దిశా పటాని ఇటలీ విమానంలో తీసిన ఫోటోను షేర్ చేసింది. ఆమె విమానంలో డార్లింగ్ ప్రభాస్ ఫోటోను తీయడం కనిపిస్తుంది.
 
సాంగ్స్ షూటింగ్‌లో భాగంగా ప్రభాస్‌తో కలిసి డ్యాన్స్‌ చేసేందుకు దిశా ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్‌కు చెందిన అశ్వని దత్ ఈ మెగా-బడ్జెట్ మూవీకి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ కూడా నటించారు. కల్కి 2898 AD వేసవిలో మే 9న విడుదలకు సిద్ధమవుతోంది.