ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 మార్చి 2024 (10:07 IST)

నాకూ, కమల్‌కు విభేదాలు ఉన్నాయని రాసేయకండి.. : రజినీకాంత్

rajinikanth
ఎన్నికల సమయం వేళ మీడియా ఉన్నపుడు నోరు తెరవాలంటే భయంభయంగా ఉందని సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. చెన్నై నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన కావేరీ ఆస్పత్రి ఎక్కడ అని అడిగితే.. ఆళ్వార్‌పేటలోని సినీ నటుడు కమల్ హాసన్ ఇంటి పక్కన అని చెప్పారు. ఇపుడు కమల్ హాసన్ ఇల్లు ఎక్కడ అంటే.. ఆళ్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రి పక్కన అని చెబుతున్నారు. 
 
ఈ మాట సాధారణంగా చెబుతున్నానంతే. మళ్లీ నాకూ, కమల్‌కు విభేదాలున్నాయని రాయకండి. మీడియా వాళ్ల ముందు మాట్లాడాలంటే భయమేస్తుంది. ఈ కెమెరాలన్నీ చూస్తుంటే భయమేస్తుంది. అసలే ఎన్నికల సమయం. నేను ఇపుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడుతున్నాను" అని సరదాగా వ్యాఖ్యానించారు. గతంలో తాను అనేక ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నానని, వాటి ఫలితంగానే ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంతో హాయిగా ఉన్నట్టు తెలిపారు.