సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2024 (14:23 IST)

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను సందర్శించిన రజనీకాంత్

rajini
నటుడు రజనీకాంత్ బుధవారం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ)పై తన పర్యటనలో, రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. 
 
ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కేవీబీ రెడ్డి, ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారులు రజనీకాంత్‌కు సాదర స్వాగతం పలికారు.  
 
ప్రముఖ సెలబ్రిటీ తమ సంస్థను సందర్శించడం పట్ల కేవీబీ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆయన సందర్శనను తమ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు.