అమ్మ నాన్నల పెళ్లిరోజు గుర్తులను పరిచయం చేసిన సౌందర్య రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ తన భార్య లతా రజనీకాంత్ తో వున్న ఫొటోను కుమార్తె సౌందర్య రజనీకాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను అలరించేలా చేసింది. పెండ్లయి 43 సంవత్సరాల సందర్భంగా నేడు అప్పటి గుర్తుగా ఉంగరాలు, గొలుసు మార్చుకున్న ఫొటోను చూపిస్తూ పోస్ట్ చేసింది.
43 సంవత్సరాల కలయిక నా ప్రియమైన అమ్మ & నాన్న, ఎప్పుడూ ఒకరికొకరు అండగా నిలబడతారు, అమ్మ 43 సంవత్సరాల క్రితం వారు మార్చుకున్న గొలుసు మరియు ఉంగరాలను ప్రతి సంవత్సరం, మీ ఇద్దరినీ చాలా ప్రేమిస్తున్నాను మరియు మరింత ఎక్కువ.. అంటూ సౌందర్య రజనీకాంత్ తెలియజేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది.
రజనీ ఇటీవలే ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లాల్ సలాం సినిమాలో నటించారు. తాజాగా మరో సినిమాలో రజనీ నటించేందుకు సిద్ధమయ్యారు.