శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (09:48 IST)

ధనుష్, సందీప్ కిషన్, సన్ పిక్చర్స్ టైటిల్ రాయన్- ఫస్ట్ లుక్

Rayan First Look
Rayan First Look
మల్టీ టాలెంటెడ్ సూపర్ స్టార్ ధనుష్  యాక్టర్ గా తన 50వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ కిషన్‌తో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ధనుష్‌కి దర్శకుడిగా ఇది రెండో సినిమా. కాళిదాస్ జయరామ్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్న ప్రాజెక్ట్ #D50ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ రోజు, మేకర్స్ ఈ తమిళం, తెలుగు,  హిందీ త్రిభాషా టైటిల్‌ను 'రాయన్‌' గా అనౌన్స్ చేశారు  
 
ధనుష్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్‌లను అప్రాన్‌లతో ఉన్న రాయన్ ఫస్ట్-లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ధనుష్ ఫుడ్ ట్రక్ ముందు నిలబడి ఉండగా, సందీప్ కిషన్ వాహనం లోపల, కాళిదాస్ దానిపై కూర్చున్నాడు. వారు తమ చేతుల్లో స్కేవర్లు, కత్తులతో కనిపించారు. ధనుష్  ఆప్రాన్‌పై రక్తపు గుర్తులను మనం గమనించవచ్చు. డ్రెస్సింగ్ వారు చెఫ్‌లని సూచిస్తుండగా, వారి ముఖాల్లోని ఎక్స్ ప్రెసన్ , వారి చేతుల్లోని ఆయుధాలు వారు కేవలం చెఫ్‌లు మాత్రమే కాదని సూచిస్తాయి.
 
ధనుష్ హ్యాండిల్‌బార్ మీసాలతో షార్ట్ హెయిర్ తో, సందీప్ కిషన్,  జయరామ్ స్పోర్ట్స్ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో చాలా క్యూరియాసిటీని పెంచుతోంది.
 
ఫస్ట్ క్లాస్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎస్ జె సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, ధుషార విజయన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఓం ప్రకాష్ డీవోపీ గా చేస్తున్నారు . ప్రసన్న జికె ఎడిటర్ గా , జాకీ ప్రొడక్షన్ డిజైనర్‌గా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
 ఈ సినిమాని ఈ ఏడాది విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
 తారాగణం: ధనుష్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, SJ సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, దుషార విజయన్