ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (11:38 IST)

రెజీనాతో ఎపైర్ గురించి ముడివిప్పిన సందీప్ కిషన్ !

Rejena-sandeep
Rejena-sandeep
నటుడు సందీప్ కిషన్ చేసింది తక్కువ సినిమాలే అయినా అటు తమిలంలో కూడా పలు సినిమాలు చేశాడు. మైకేల్ సినిమా డిజాస్టర్ అయింది. తాజాగా ఊరు పేరు భైరవ కోన సినిమా చేశాడు. అది ఈనెల 16 న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా ఇంటర్యూ ఇస్తూ వ్యక్తిగత లైఫ్ గురించి చెప్పాడు. ఇప్పటికే ముగ్గురిని ప్రేమించాననీ, వారితో రిలేషన్ షిప్ వున్నా. ఒకరితర్వాత ఒకరు వద్దనుకున్నారంటూ చెప్పారు. కారణం ఏమిటనేది చెప్పకుండా వారుకూడా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిలే అని వెల్లడించారు.
 
ఇక రెజీనాపై లవ్, ఎఫైర్ వుందని, పెండ్లి చేసుకోబోతున్నారనంటూ వస్తున్న వార్తపై ఈ విధంగా స్పందించారు. రెజీనాకు నా బ్రేక్ అప్ కష్టసుఖాలు తెలుసు. తను మంచి ఫ్రెండ్. పెండ్లి గురించి చాలామంది అడుగుతున్నారు. పెండ్లిపై నమ్మకం అనేది బ్రేకప్ చేసిన అమ్మాయిలవల్ల నమ్మలేదు. ఇటీవలే నమ్ముతున్నా. టైం వచ్చినప్పుడు అవుతుంది. అది ఎప్పుడు, ఎవరితో అనేది త్వరలో చెబుతానంటూ తెలిపారు. సందీప్ కిషన్, ఛోటా కె.నాయుడు మేనల్లుడు అన్న విషయం తెలిసిందే.