బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2024 (18:29 IST)

ఊరు పేరు భైరవకోనకు ఏజెంట్ రిజల్ట్ రిపీట్ అయ్యేనా?

ooru peru
ooru peru
సందీప్ కిశన్ హీరోగా నటించిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఈ సినిమాకు కష్టాలు కూడా వున్నాయి. సంక్రాంతికి విడుదలకావాల్సిన సినిమా వాయిదావేసుకున్నారు. ఆతర్వాత రవితేజ ఈగల్ సినిమా విడుదల తొమ్మిదవ తేదీన విడుదలకాావాల్సిన సినిమా వాయిదా పడింది. ఇక రేపు విడుదలకావాల్సిన సినిమాకు ముందుగానే వైజాగ్ పంపిణీదారుడు కేసు వేశారు. ఏజెంట్ సినిమా టైంలో మాకు ఇవ్వాల్సిన సొమ్మ ఇవ్వకుండా మోసం చేశాడనే కేసు పెట్టారు. ఆ తర్వాత కోర్టు క్లియర్ తో ఏజెంట్ విడుదలయి డిజాస్టర్ అయింది.
 
ఇక అదే సీన్ రిపీట్ అయింది. ఊరుపేరు బైరవకోనకు మరోసారి వైజాగ్ పంపిణీదారుడు కేసు వేశాడు. నిర్మాత అనిల్ సుంకర మోసాన్ని మరోసారి బయటపెట్టాడు. ఈరోజే కోర్టు క్లియర్ ఇచ్చింది. అయితే ముందుగానే ఈ సినిమా పెయిడ్ ప్రివ్యూ వేశారు. బ్లాక్ బస్టర్ హిట్అంటూ ప్రచారాన్ని బాగా చేశారు. కానీ ఈసినిమా మరో ఏజెంట్ అని టాక్ ఇండస్ట్రీలో నెలకొంది. చూసినవారంతా ఏమంత ఆకట్టుకోలేదని తెలుస్తోంది. గరుడపురాణం అంటూ కల్పిత కథతో భయంతో జనాలను ఆకట్టుకోవాలని చూసిన దర్శక నిర్మాతల ఆలోచన బెడిసికొట్టిందని టాక్ నెలకొంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా.. సినిమాను మార్చి తీసినట్లు చెబుతున్నారు.