గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 30 జనవరి 2024 (17:41 IST)

రవితేజ ఈగిల్ కోసం ఊరు పేరు భైరవకోన విడుదల వాయిదా

Kavya Thapar, Varsha Bollamma, sandeep
Kavya Thapar, Varsha Bollamma, sandeep
సందీప్ కిషన్ మాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత.
 
ఇంతకుముందు ఫిబ్రవరి 9న సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈగిల్ సినిమా అదే రోజు విడుదల కావడంతో థియేటర్స్ సమస్య తలెత్తడంతో  తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాన్ని గౌరవిస్తూ,  తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంక్షేమం కోసం, మేకర్స్ మొదట ప్రకటించిన తేదీని మార్పు చేశారు. ఊరు పేరు భైరవకోన ఇప్పుడు ఫిబ్రవరి 16, 2024న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
అదే విషయాన్ని ప్రకటించడానికి మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సందీప్ కిషన్ మంత్రదండం పట్టుకుని కనిపించారు. అతని వెనుక హీరోయిన్స్ కనిపించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్, 2 చార్ట్‌బస్టర్ పాటలు నిజమే నే చెబుతున్నా, హమ్మా హమ్మాతో ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది.  
 
 కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరిగాన డైలాగ్స్ రాశారు.