సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2024 (12:09 IST)

పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం మహిళ లింక్ క్లిక్ చేసింది.. అంతే రూ. 4.72 లక్షలు స్వాహా

cyber
హైదరాబాద్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళను రూ.4.72 లక్షలు మోసం చేశారు సైబర్ దుండగులు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ మహిళ పార్ట్ టైమ్ జాబ్ కోసం లింక్‌తో కూడిన సందేశాన్ని అందుకుంది. 
 
ఆమె లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, ఆమె ఒక గ్రూప్‌లో జాయిన్ అయ్యింది. ఆపై ఆ గ్రూపులోని వారు పెట్టుబడి పెడితే భారీగా రాబడి ఇస్తామని చెప్పి మహిళను ఉచ్చులోకి నెట్టారు. మొదట్లో అనుమానం రావడంతో కొద్ది మొత్తంలో బాధిత మహిళ పెట్టుబడి పెట్టింది. 
 
వెంటనే లాభాలు అందుకుంది. ఆ తర్వాత మహిళ రూ. 4.72 లక్షల మేర అత్యాశతో పెట్టుబడి పెట్టింది. కానీ లాభాలు రాలేదు. తీరా డబ్బూ పోయింది. దీంతో మోసపోయానని తెలిసి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.