గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2024 (10:46 IST)

సింగరేణి కార్మికులకు రూ. 1.90లక్షల బోనస్‌.. దసరా కానుక

Revanth Reddy
సింగరేణి కార్మికులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. 
 
అలాగే సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దసరాకు ముందుగానే బోనస్‌ ఇస్తున్నామని చెప్పారు. సింగరేణిలో 33 శాతం లాభాలు పంచుతామన్న ముఖ్యమంత్రి.. ఒక్కొక్కరికి రూ. లక్షా 90 వేలు బోనస్‌ ఇస్తున్నట్టు వెల్లడించారు. 
 
రూ.796 కోట్లు బోనస్‌గా అందిస్తామని వివరించారు. గతేడాది కంటే రూ.20 వేలు అధికంగా ఇస్తామని చెప్పారు. అలాగే సౌర విద్యుత్ ప్లాంట్‌ను 1,000 మెగావాట్లకు విస్తరించడం, రామగుండంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. సింగరేణి ఉత్పత్తిని పెంచుతూ ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు.