గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (14:53 IST)

గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ - సీఈసీ లేఖ

dk aruna
గత ఎన్నికల్లో గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీకే అరుణ ఎమ్మెల్యేగా గెలిచినట్టుగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది. గద్వాల నుంచి డీకే అరుణ గెలిచినట్టు ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెల్సిందే. ఈ తీర్పు నేపథ్యంలో డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సకంఘాన్ని ఆదేశిస్తూ లేఖ రాసింది.
 
గత ఎన్నికల్లో గద్వాల నుంచి తెరాస తరపున కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. డీకే అరుణ రెండో స్థానంలో నిలించారు. అయితే, నామినేషన్ దాఖలు సమయంలో కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు వివరాలు సమర్పించారు.  దీంతో తెలంగాణ హైకోర్టు కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు శిక్షగా రూ.2.50 లక్షల అపరాధం కూడా విధించింది. 
 
అలాగే, కోర్టు ఖర్చుల కింద పిటిషన్ దాఖలు చేసిన డీకే అరుణకు రూ.50 వేలు చెల్లించాలని తీర్పునిస్తూ, డీకే అరుణను గత 2018 డిసెంబరు 12వ తేదీ నుంచి ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది.