శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (10:28 IST)

భారత్ రాష్ట్ర సమితి ఆదాయం రూ.37 కోట్ల నుంచి రూ.218 కోట్లకు పెరుగుదల

bharat rashtra samithi
ఇటీవల భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆదాయం భారీగా పెరిగిపోయింది. బీఆర్ఎస్ ఆదాయం గత 2021-22 సంవత్సరంలో కేవలం 37.65 కోట్ల రూపాయలుగా ఉంటే ఇపుడు అది ఏకంగా రూ.218.11 కోట్లకు పెరిగింది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన 2022 ఆడిట్ రిపోర్టులో పేర్కొది. 
 
ఈ నివేదిక ప్రకారం ఈ యేడాది ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.153 కోట్ల ఆదాయాన్ని తెరాస సేకరించింది. అలాగే, ట్రస్టుల ద్వారా రూ.40 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆ నివేదికలో పేర్కొంది. పార్టీ మొత్తం ఆస్తుల విలువ యేడాదిలో రూ.288 కోట్ల నుంచి రూ.480 కోట్లకు చేరింది.
 
బ్యాంకులు, పోస్టాఫీసుల్లో12 నెలలకు మించి కాలపరిమితితో కూడిన డిపాజిట్ల రూపంలో ఆ పార్టీకి 2022 మార్చి 31వ తేదీ నాటికి రూ.451 కోట్లు దాచింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇలాంటి డిపాజిట్లు రూ.256 కోట్లుగా ఉన్న విషయం తెల్సిందే.