బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2022 (17:03 IST)

బీఆర్ఎస్ ఆవిర్భావం - ఆ రెండు జెండాలకు ఉన్న తేడాలు ఇవే..

brs flag
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. ఇప్పటివరకు ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చగా, దీనికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపింది. దీంతో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ శుక్రవారం జరిగింది. ఈసీ పంపిన లేఖపై సీఎం కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 1.20 గంటలకు సంతకం చేశారు. దీంతో దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ కొత్తగా పురుడు పోసుకుంది. 
 
ఈ సందర్భంగా బీఆర్ఎస్ కోసం రూపొందించిన జెండాను ఆవిష్కరించారు. తెరాస జెండాలోనే పలు మార్పులు చేసి బీఆర్ఎస్ జెండాగా ప్రకటించారు. ముఖ్యంగా, తెరాస జెండాలో తెలంగాణ పటం ఉండేది. దాని స్థానంలో ఇపుడు భారత్ పటం చేరింది. అలాగే, జై తెలంగాణ నినాదానికి బదులుగా, జై భారత్ అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ జెండా గుర్తు మాత్రం గులాబీ రంగులోనే ఉంది. 
 
కాగా, బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరణ కార్యక్రమంలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామితో పాటు సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా హాజరయ్యారు. బీఆర్ఎస్ ఆవిర్భావంతో తెరాస ఇకపై కనుమరుగు కానుంది. కేవలం చరిత్ర పుటల్లోనే ఓ అధ్యాయంగా మిగిలిపోనుంది.