ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (08:32 IST)

కరోనా వైరస్ సోకి కాంగ్రెస్ నేత సీనియర్ ఎమ్మెస్సార్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెస్సార్ (ఎం.సత్యనారాయణరావు) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. కరోనా వైరస్ సోకడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చిన ఆయన.. మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. 
 
ఎమ్మెస్సార్‌కు కొవిడ్ సోకడంతో కుటుంబ సభ్యులు ఆదివారం ఆయనను నిమ్స్‌లో చేర్చారు. అక్కడాయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడమే కాకుండా మరింత క్షీణించింది. దీంతో ఈ తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెస్సార్ ఆర్టీసీ ఛైర్మన్‌గా, దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి అత్యంత సన్నిహితుడుగా మెలిగారు.