సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (17:34 IST)

నేను బొమ్మాళీ అయితే కేసీఆర్ పశుపతి అవుతాడా?: డీకే అరుణ కౌంటర్

తెలంగాణ రాష్ట్ర సమితి నేత, నిజామాబాద్ ఎంపీ కవిత- కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. డీకే అరుణను ఉద్దేశించి ''బొమ్మాళీ ఇంట్లో కూర్చో''అంటూ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర సమితి నేత, నిజామాబాద్ ఎంపీ కవిత- కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. డీకే అరుణను ఉద్దేశించి ''బొమ్మాళీ ఇంట్లో కూర్చో''అంటూ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కవిత కామెంట్లపై డీకే అరుణ కూడా ధీటుగా సమాధానమిచ్చారు.

''నేను బొమ్మాళీని అయితే, మీ నాన్న కేసీఆర్‌ పశుపతి అవుతాడా.?"అని డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జిల్లాలు ఏర్పాటు చేయడం సరికాదని అరుణ హితవు పలికారు.
 
గద్వాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష చేస్తున్నారు. తనను విశ్రాంతి తీసుకోవాలని కవిత చెప్పడంపై స్పందిస్తూ... ప్రజాప్రతినిధిగా తానెన్నడూ విశ్రాంతి తీసుకోలేదన్నారు. ఆమె తన తండ్రికే ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తే మంచిదన్నారు.

గద్వాలలోని కోట తమది కాదని అరుణ గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం జిల్లాల ఏర్పాటులో మొండి వైఖరి వీడాలని హితవు పలికారు. గద్వాలను జిల్లాగా చేయాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొత్త జిల్లాల ఏర్పాటు తగదని డికె అరుణ అభిప్రాయపడ్డారు. ఏయే ప్రాతిపదికన జిల్లాల విభజన చేస్తున్నారో చెప్పాలన్నారు.