శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శుక్రవారం, 16 జూన్ 2017 (12:46 IST)

ఎస్సై 2 గంటలు ప్రయత్నించినా లొంగని శిరీష...? తేజస్విని ఏం చెప్పింది?

బ్యూటీషియన్ శిరీషపై లైంగిక దాడి జరగడం వల్లే ఆమె మృతి చెంది వుంటుందని తొలుత భావించారు. కానీ ఫోరెన్సిక్ నివేదికను బట్టి ఆమెపై అత్యాచారం జరగలేదని తేలింది. ఐతే ఎస్సై ప్రభాకర్ రెడ్డి, శిరీషలు ఒకే గదిలో 2 గంటల పాటు వున్నారు. ఈ క్రమంలో అతడు ఆమెపై లైంగిక దాడ

బ్యూటీషియన్ శిరీషపై లైంగిక దాడి జరగడం వల్లే ఆమె మృతి చెంది వుంటుందని తొలుత భావించారు. కానీ ఫోరెన్సిక్ నివేదికను బట్టి ఆమెపై అత్యాచారం జరగలేదని తేలింది. ఐతే ఎస్సై ప్రభాకర్ రెడ్డి, శిరీషలు ఒకే గదిలో 2 గంటల పాటు వున్నారు. ఈ క్రమంలో అతడు ఆమెపై లైంగిక దాడికి తెగబడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఆ దాడిని శిరీష ప్రతిఘటించడంతో పాటు పెద్దగా కేకలు వేయడంతో ఎస్సై బెదిరిపోయాడు. దీనితో రామచంద్రాపురం వెళ్లిన శ్రవణ్‌, రాజీవ్‌లను ఎస్సై వెనక్కి పిలిపించారు. వారు రాగానే ఆమెను తొందరగా తీసుకెళ్లండంటూ బలవంతంగా కారులో ఎక్కించి పంపించేశారు. కారులో వెళుతుండగా శిరీషను ఇద్దరూ కొట్టినట్లు సమాచారం. ఆ రోజు రాత్రి జరిగిన వ్యవహారంపై ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి వుంటుందని తెలుస్తోంది. 
 
ఫోరెన్సిక్ రిపోర్టు ప్రకారం ఆమె ఆత్మహత్య చేసుకుందని తేలింది. ఐతే ఆమె బలవన్మరణానికి రాజీవ్, శ్రవణ్ లు కారకులయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు వారిద్దరినీ శుక్రవారం అరెస్టు చేశారు. మరోవైపు తేజస్విని వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆమె ఏం చెప్పిందన్నది ఇప్పుడు తేలాల్సి వుంది.