ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (22:11 IST)

తెలంగాణలో భారీ వర్షాలు: వరద నీటిలో మునిగిన కలెక్టరేట్

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వ కార్యాలయాలు వరద నీటిలో మునిగిపోతున్నాయి. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించిన రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ భవనం వరదల కారణంగా నీట మునిగింది. 
 
తాజాగా నిజామాబాద్ కలెక్టరేట్ భవనం కూడా వరద వచ్చింది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవనం.. త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అయితే, నిజామాబాద్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తింది. కలెక్టరేట్ లోకి వెళ్లే మార్గం పూర్తిగా జలమయమైంది.