శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (11:49 IST)

రెండు తలల గొర్రె పిల్ల జననం .. ఎక్కడ?

నిజామాబాద్ జిల్లాలో రెండు తలల గొర్రె పిల్ల జన్మించింది. జిల్లాలోని జ‌క్రాన్‌ప‌ల్లి మండ‌ల కేంద్రానికి చెందిన తొగ‌రి ల‌క్ష్మ‌ణ్‌కు గొర్రెల మంద ఉంది. ఈ మంద‌లోని ఓ గొర్రె ప్ర‌స‌వించింది. 
 
ఆ గొర్రెకు పుట్టిన పిల్ల వింత‌గా రెండు త‌ల‌ల‌తో జ‌న్మించింది. వింత‌గా జ‌న్మించిన గొర్రె పిల్ల‌ను చూసేందుకు జ‌నాలు త‌ర‌లివ‌స్తున్నారు. జ‌న్యు లోపంతోనే ఈ ర‌కంగా జ‌న్మించి ఉండొచ్చ‌ని ప‌శు వైద్య అధికారులు చెబుతున్నారు.