గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 24 జులై 2021 (10:52 IST)

ఐదు కొమ్ములతో గొర్రె - యుగాంతానికి సంకేతమా?

ఈ విశ్వంలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. అలాంటి సంఘటనల గురించి తెలిసినా, కళ్లారా చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతుంటారు. పైగా, కొన్ని సంఘటనలు యుగాంతానికి అంతంగా పేర్కొంటుంటారు. 
 
తాజాగా ఓ గొర్రె ఐదు కొమ్ములతో పుట్టింది. నైజీరియాలోని లాగోస్‌ అనే ప్రాంతంలో బక్రీద్‌ పర్వ దినం సందర్భంగా ఈ దేశంలో గొర్రెల సంత నిర్వహించగా అపుడు ఈ గొర్రె కెమెరా కంటికి చిక్కింది. అంతే.. ఈ గొర్రె ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. 
 
పైగా, ఈ గొర్రె తల ఇపుడు స్టేటస్ ఫ్ లిబర్టీ సింబల్‌ను తలపిస్తుంది. ఇలాంటి గొర్రె జన్మించడం ప్రంపంచానికి అరిష్టమని, ఇది యుగాంతానికి అంతమంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే.