బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 21 ఆగస్టు 2022 (17:17 IST)

హోటల్ గదిలో నలుగురు ఆత్మహత్య.. ఫ్యామిలీ మొత్తం...

suicide
హోటల్‌ గదిలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటన స్థానికులందరినీ కలచివేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌లోని కపిలహోటల్లో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
మృతులను ఆదిలాబాద్‌కు చెందిన సూర్య ప్రకాష్, అతని భార్య అక్షయ, పిల్లలు ప్రత్యుష, అద్వైత్‌లుగా గుర్తించారు. సూర్య ప్రకాష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే, గత రెండు వారాలుగా సూర్య ప్రకాష్ కుటుంబం హోటల్‌లోనే ఉంటున్నట్టు సమాచారం.
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకోవటం వెనుక గల కారణాలపై ఆరా తీస్తున్నారు.