గద్దర్ మారిపోయారు... చేతిలో బుద్ధుడి జెండా, పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్...
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా... అంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్నంతా ఏకతాటిపైకి తెచ్చిన గద్దర్ మారిపోయారు. గత దశాబ్దాలుగా ఎర్రజెండాను భుజాన వేసుకుని, నల్ల కండువాను వేసుకుని కమ్యూనిస్ట్ ఉద్యమం పట్ల ప్రజల్లో సానుభూతిని
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా... అంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్నంతా ఏకతాటిపైకి తెచ్చిన గద్దర్ మారిపోయారు. గత దశాబ్దాలుగా ఎర్రజెండాను భుజాన వేసుకుని, నల్ల కండువాను వేసుకుని కమ్యూనిస్ట్ ఉద్యమం పట్ల ప్రజల్లో సానుభూతిని రగిలించిన గద్దర్ వైఖరిలో మార్పు వచ్చేసింది. ఈమధ్య గద్దర్ ఒక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఆ ఫోటోను చూసిన మార్క్సజం నాయకులు షాక్ తిన్నారు.
ఇంతలోనే మరో షాక్ ఇస్తూ తను మావోయిస్టు సిద్ధాంతాల నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల వ్యవస్థపై ఆధారపడిన ప్రజాస్వామ్యం వైపు నడుస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాదు చేతిలో ఎప్పుడూ వుండే ఎర్ర జెండాను వదిలేసి బుద్ధుడు వున్న జెండాను ఆయన చేతబూనారు.
ఇటీవలే పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న వైఖరి తనకు ఎంతగానో నచ్చుతోందని కూడా చెప్పారు. మొత్తమ్మీద రాబోయే కాలంలో ఇటు ఆంధ్రలో పవన్, అటు తెలంగాణలో గద్దర్-కోదండరామ్ కలిసి ముందుకు నడిచే అవకాశం వున్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి.