శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (07:34 IST)

ఢిల్లీలో అసదుద్దీన్ ఇంటిపై దాడి... గూండాలను రెచ్చగొట్టారు: ఒవైసీ

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడి జరిగింది. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న ఇంటిపై హిందూ సేనకు చెందిన కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన నివాసం పాక్షికంగా ధ్వంసమైంది. కిటికీలు దెబ్బతిన్నాయి. ఈ దాడి ఘటనకు సంబంధించి ఐదుగురు హిందూ సేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ దీపక్‌ యాదవ్‌ తెలిపారు. 
 
మరోవైరు, ఈ దాడి ఘటనపై ఎంపీ అసదుద్దీన్ స్పందించారు. తన నివాసంపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. గూండాలను రెచ్చగొట్టి తన ఇంటిపై దాడి చేయించారన్నారు. దేశ రాజధానిలో ఓ ఎంపీ నివాసం సురక్షితంగా లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఏం జవాబు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. 
 
'నేను లేని సమయంలో ఢిల్లీలో గూండాలు ఆయుధాలతో గుంపులుగా వెళ్లి, నా ఇంటిపై కర్రలు, గొడ్డళ్లతో దాడి చేసి పారిపోయారు. ఈ దాడిలో నా ఇంటి కాపలాదారు గాయపడ్డాడు. దాడులతో భయపెట్టలేరు. మజ్లిస్‌ అంటే ఏమిటో ఆ గూండాలకు తెలీదు' అని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.